Home
Categories
EXPLORE
True Crime
Comedy
Society & Culture
Business
Sports
Health & Fitness
Technology
About Us
Contact Us
Copyright
© 2024 PodJoint
Loading...
0:00 / 0:00
Podjoint Logo
US
Sign in

or

Don't have an account?
Sign up
Forgot password
https://is1-ssl.mzstatic.com/image/thumb/Podcasts115/v4/42/54/fc/4254fc7a-00cd-e729-8326-aab0d3554809/mza_8125136163025605915.jpg/600x600bb.jpg
Telugu Sahityam Teasers
Dasubhashitam
182 episodes
1 day ago
ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తిపర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. పూర్తి శ్రవణ పుస్తకాల కోసం దాసుభాషితం యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ అప్ స్టోర్ ల నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. Store Links https://play.google.com/store/apps/details?id=com.dasubhashitam https://apps.apple.com/us/app/dasubhashitam-telugu-audiobook/id1319854474
Show more...
Books
Arts
RSS
All content for Telugu Sahityam Teasers is the property of Dasubhashitam and is served directly from their servers with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తిపర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. పూర్తి శ్రవణ పుస్తకాల కోసం దాసుభాషితం యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ అప్ స్టోర్ ల నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. Store Links https://play.google.com/store/apps/details?id=com.dasubhashitam https://apps.apple.com/us/app/dasubhashitam-telugu-audiobook/id1319854474
Show more...
Books
Arts
Episodes (20/182)
Telugu Sahityam Teasers
Airport

#ఎయిర్‌పోర్ట్

ఆర్థర్ హెయిలీ

ఒక్కోసారి మన జీవితంలో జరిగే సంఘటనలు మనల్ని అగాధాల్లోకి తోసేస్తాయి. అలాగే కొన్ని సంఘటనలు మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టి ఆ అగాధం నుండి బయటపడేలా చేస్తాయి. ఒక ఎయిర్‌పోర్ట్ లో ఉండే రకరకాల మనుషుల మనస్తత్వాలను ఇందులో వివరిస్తాడు హెయిలీ. ఈ పాత్రలు మనకు ఎక్కడో ఒక చోట తారసపడతారు. వెర్నర్ అనే పైలెట్ తాను ఎంతో గొప్పగా విమానాలు నడపగలడని అహంకారంతో ఉంటాడు.తన జీవితాన్ని ఎంతో ఆహ్లాదంగా ఎటువంటి బాదరబందీలు లేకుండా గడుపుతుంటాడు. గోవైన్ అనే ఎయిర్ హోస్టెస్ వెర్నర్ ప్రేమలో పడి అతను పెళ్లి చేసుకోనంటే ఆమె ధైర్యంగా ఒంటరిగా బతకాలని అనుకుంటుంది. మెక్ ఆ ఎయిర్‌పోర్ట్ మేనేజర్. అతని భార్యకి విలాసాలు, వినోదాలు, పార్టీలు అంటేఇష్టం. మెక్ తనతో ఇలా ఆనందాల్లో పాల్గోటంలేదని అతని భార్య సిండీ విడాకులు ఇస్తానని ఎయిర్‌పోర్ట్‌కి పిల్లల్ని తీసుకుని వస్తుంది. ప్రతీసారి టిక్కెట్టు తీసుకోకుండా ప్రయాణం చేస్తుంది ఆడ. ఇంకో రన్వే వేయమని వెర్నర్ మెక్‌తో గొడవపడుతూ ఉంటాడు. మెక్ తమ్ముడు కెయిత్ రాడార్‌లో సంకేతాలు ఇచ్చే విభాగంలో ఉంటాడు. అతను ఏడాదిన్నర క్రితం చేసిన ఒక పనివల్ల కృంగిపోతాడు. తిరిగి ఇప్పుడు ఆ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక సంఘటన అందరి జీవితాలని మార్చేసింది. ఎవరి జీవితాన్ని ఎలా మార్చిందో ? కెయిత్ చేసిన ఆ పని ఏమిటో వినండి.

---

#ఎయిర్‌పోర్ట్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-airport

–––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

---

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
26 minutes 11 seconds

Telugu Sahityam Teasers
Bali

#ఆత్మదృష్టి

జానకి బాల

కథకు వాస్తవికత ప్రధానం. ఒక్కోకథలో ఒక్కో జీవితసత్యాన్ని వివరించారు బాలగారు. ఒక ఆత్మ ఒక దృష్టితో ICU లోని రోగుల జీవితగాథలను వివరించిన తీరు 'ఆత్మదృష్టి' లోనూ; ఒక మనిషికి ఎదుటివారు పడే బాధ తాను అనుభవిస్తే గానీ తెలీదు. అలా బాధను అనుభవించిన ఆఫీసర్ ఏం చేసాడో 'ఆకలి' లోనూ; ఒక శ్రీమతి చేసేపని ఏమిటో ఆమె వల్ల ఇల్లు ఎలా నడుస్తుందో 'ఆమె' లోనూ; చిన్నప్పుడే తల్లిని కోల్పోయి, సవతితల్లి వల్ల విసుగు చెందిన ప్రభావతి, అదేవిధంగా తల్లిని కోల్పోయి సరైన ప్రేమానురాగాలు లేని రఘు దంపతులయ్యారు. కానీ 3 నెలల్లో వారు విడిపోవాలనుకుంటారు. వారు ఎందుకు విడిపోవాలనుకుంటారు? వారికి ఏమి చెప్పి మధ్యవర్తులు కలుపుతారో? అసలు భార్యాభర్తలకి ఎక్కడ అవగాహనా రాహిత్యం వస్తోందో? ఎలా ఆలోచించాలో ఒక పాత్ర ద్వారా బాలగారు ఎలా చెప్పారో 'దీర్ఘాయుష్మాన్భవ' లోనూ ఇంకా మరికొన్ని కథలను వినండి.

---

#ఆత్మదృష్టి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-aatma-drusti

–––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

---

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
11 minutes 11 seconds

Telugu Sahityam Teasers
Tamoshi

#తమోషి జరాసంధ తమోషి అనగా ఖైదు. ఖైదీకి నేరస్తుడికి చిన్న బేధం ఉంది. నేరం నిరూపణ కాకుండానేజైలులో ఉండే వారిని ఖైదీ అంటారు. రామ్ నిరూపణ అయి శిక్షను అనుభవించే వారిని నేరస్తుడు అంటారు. ఈ రచయిత జరాసంధ ఒక జైలు అధికారి. ఈయన జైలులో పని చేస్తున్నా అతని హృదయం బండబారిపోలేదు అని ఈ నవలను చదివితే అర్ధమవుతుంది. శిక్ష నిరూపణ అయినవారు శిక్షను అనుభవించి వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొన్ని జీవితగాధలు మనల్ని, మనలో ఉండే మానవత్వాన్ని ప్రశ్నిస్తాయి. ఎలాగంటే అది నేరం కానప్పుడు శిక్ష ఎందుకు వేశారు అని . ఈ నవలలోని మల్లికా గంగూలి పల్లెటూరికి చెందిన అందమైన అమ్మాయి. ఆమె పెళ్లి ఇంకొంత సమయంలో జరగబోతోంది అనగా ఆ పెళ్లి కొడుకు పాము కాటుకి గురై మరణిస్తాడు. ఆమెని తన తండ్రి కన్నా పెద్ద వయసున్న అతనితో పెళ్ళిచేయాలని చూస్తారు గ్రామస్థులు. ఆ పరిస్థితుల్లో మహేష్ గంగూలీ ఆమెని పెళ్లి చేసుకుంటాడు.మహేష్ ఇంట్లో అందరికి దగ్గరవుతున్న సమయంలో ఒక జరగరాని సంఘటన జరుగుతుంది. దాని ప్రతిఫలంగా సంభవించిన పరిస్థితులకి ఆమె నేరస్తురాలవుతుంది. ఆ సంఘటన ఏమిటి? ఆమె ఎందుకు శిక్షని అనుభవిస్తోంది ఈ నవలా విశ్లేషణలో వినండి. --- #తమోషి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/pc-thamoshi ––– ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. --- ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
28 minutes 42 seconds

Telugu Sahityam Teasers
Atmaramam

#ఆత్మారామం

రాధిక నోరి

కథల్ని మనసుతో ఉన్న పరిసరాలతో ముడిపెట్టి అల్లితే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈతరం పిల్లలకు పెళ్లిపై ఒక అవగాహనలేక వారి కోరికలను పెంచుకుంటూ పోగా, అవి తీరక చివరికి ఏంజరుగుతోందో 'తికమక' లోనూ, మనం చేసే ప్రతీపనికి మన ఆత్మ సాక్షిగా నిలుస్తుంది. అలాంటి ఒక ఆత్మఘోష ఎలా ఉంటుందో 'ఆత్మారామం' లోనూ, తన జీవితభాగస్వామిని కోల్పోయాక, వయసు అయిపోయాక ఇంకో తోడుతో సహజీవనం ఎలా ఉంటుందో 'మరో మారు ' లోనూ, గ్రాడ్యుయేషన్ పూర్తి అయితే పార్టీ ఇచ్చారంటే విడ్డూరం ఉందనుకునే మనం, ఆ పార్టీ ఎవరికి ఇచ్చారో 'గ్రాడ్యూటీన్ పార్టీ' లో, విదేశాలలో పండగలని ఎలా చేసుకుంటారో 'పండగ' లోనూ ఇంకా మరి కొన్ని కథలను రచయిత రాధికా నోరి గళంలో వినండి.

---

#ఆత్మారామం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/ab-aatmaramam

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
20 minutes 48 seconds

Telugu Sahityam Teasers
The Girl In The White Ship

#దగర్ల్‌ఇన్‌దవైట్‌షిప్

పీటర్ టౌన్సెండ్

ఎన్ని విపత్తులు జరిగినా, ఎన్ని ప్రకృతి విలయాలు జరిగినా మనిషి భగవంతునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు. ఈ సృష్టిలో ఏది జరిగినా అది మన మంచి కోసమే అనుకోమంటారు. మనిషిని ఏదో ఒక ఆశ నడిపిస్తుంది. మనం ఉన్న ప్రదేశాలు నివాసయోగ్యాలు కానప్పుడు ఆహారం దొరకకపోయినా, అక్కడి రాజులుగాని, ప్రభుత్వంగాని నిరంకుశంగా ఉన్న అక్కడ బతకడం కష్టమవుతుంది. ప్రాణాలకోసం మనిషి పోరాటం సాగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, బతకాలన్న తీవ్రమైన కాంక్ష మనిషిని విజేతని చేస్తుంది. దక్షిణ వియాత్నం‌లోకి వలస వచ్చిన చైనీయుడు టింహా వాచీ రిపేర్ చేసుకుంటూ, ఇల్లు, ఆస్థి సంపాదించుకున్నాడు.ఇతనికి 4 అబ్బాయిలు, ఒక్కగానొక్క అమ్మాయి హ్యూ హ్యూ. వాచీలు బాగుచేస్తూ డబ్బులు కూడబెడుతూ బంగారు కణికలు కొని దాచేవాడు టింహా. బంగారం ఇస్తే వారిని రహస్యంగా ఆ దేశం నుంచి తప్పిస్తారని ఆశ. టింహా దగ్గర 2 సార్లు డబ్బులు తీసుకుని మోసం చేస్తారు. మూడవ సారి దేశమంతా పండగ హడావిడిలో ఉండగా ఓడలో ఆ దేశం నుంచి తప్పించుకుందాం అనుకుంటారు. కానీ ఎవరికి వారుగా విడిపోతారు. ఓడ లో హ్యూ, అతని అన్న ట్రాంగ్ ఒక 50 మందితో ప్రయాణం సాగించగా, ఆహరం లేక అందరు చనిపోగా సముద్రంలో చివరికి 8 మందితో హ్యూ ఇంకో ఓడ ఎక్కాలనుకుంటారు. కళేబరాల మధ్యన అస్థిపంజరంలా, తిండి లేక ఆ అమ్మాయి హ్యూ యొక్క పరిస్థితి ఏమిటో ? చివరికి ఆ అమ్మాయి తన తల్లి తండ్రులను కలుసుకుందా లేదా? ఇవన్నీ ఈ నవలావిశ్లేషణలో వినండి.

Image : https://i.pinimg.com/564x/fb/15/81/fb15815d8c3d40381851a105466d9dc4.jpg

---

#దగర్ల్‌ఇన్‌దవైట్‌షిప్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/pc-the-girl-in-the-white-ship

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
21 minutes 40 seconds

Telugu Sahityam Teasers
Hampi Prayanam | Yatranubhavalu Karnataka

#యాత్రానుభవాలుకర్ణాటక

రామ్ కొత్తపల్లి

మన భారతదేశం ఎంతో శిల్పసంపదకు నిలయం. అందులోనూ దక్షిణ భారతంలోని తమిళనాడు,కర్ణాటకలను శిల్పనిధులని చెప్పాలి. ఏకశిలరథం, విరూపాక్ష దేవాలయం, లేపాక్షి ప్రతి ఒక్కరూ చూడాలి అనుకుంటారు. కళలను ప్రోత్సహించిన రాజులలో శ్రీకృష్ణ దేవరాయలుని గొప్పగా చెప్పుకుంటారు. హొయసల రాజుల కాలం నాటినుండి అనగా కొన్ని వందలయేళ్ళ నాటి శిల్పాలు వాటి కథలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ప్రతీ ఒక్క శిల్పం పైనా Ph D చేయొచ్చు. శిల్పకళ మీద, ఆ సౌదర్యం మీద ఆసక్తి ఉన్నవారికి ఈ యాత్రలు మృష్టాన్నభోజనం లాంటివి. ఈ విజ్ఞాన, విహార యాత్రకు ఎంతోకొంత అనుభవం ఉన్న వారు చెప్పినది వినక ఈ యాత్రలు సులభంగా,పరిపూర్ణంగా చేయలేము. అందుకే రామ్ కొత్తపల్లి కర్ణాటక అనుభవాలు వినండి.

---

#యాత్రానుభవాలుకర్ణాటక శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/pc-yatranubhavalu-karnataka

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
6 minutes 8 seconds

Telugu Sahityam Teasers
17 Neeli Topi Raod Kooli | Rendu Maha Nagaraalu 2

#రెండుమహానగరాలు2

తెన్నేటి సూరి

మానెట్‌గారి పరిస్థితి బాగుపడి ఆయన తన కూతురు, అల్లుడు, మానవరాలితో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఫ్రాన్స్ ప్రతీకార జ్వాలలతో రగిలిపోతూ ఉంది. చాలా సామాన్యంగా సారా దుకాణం నడుపుకుంటున్న డిఫార్చ్ దంపతులు రాజవ్యవస్థపై పోరాడడానికి ఒక తిరుగుబాటు‌ సైన్యాన్ని తయారుచేసారు. ఒకనాడు డార్నే టెక్సాస్ బ్యాంక్లో ఉండగా ఫ్రాన్స్ యువరాజుకు ఒక ఉత్తరం వస్తుంది. మరు పేరు తో ఉన్న డార్నే ఆ ఉత్తరం తనకే వచ్చిందని తెలుసుకుని పగతో రగులుతున్న ఫ్రాన్స్ కి పయనమై వెళ్తాడు. ఫ్రాన్సులో ప్రతీకార జ్వాలల్లో అతను చిక్కుకుంటాడు. ఒకసారి విచారణలో బయట పడగా మళ్ళీ అతనిని ఖైదు చేస్తారు. ఉరిశిక్షకు గురైన డార్నేను తప్పించడానికి లారీ, లూసీ, మానెట్ చేసిన ప్రయత్నాలు ఏమిటో, చివరికి ఏమైందో ఈ రెండవ భాగంలో వినండి.

---

#రెండుమహానగరాలు2 శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/ab-rendu-mahaanagaralu-2

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
18 minutes 3 seconds

Telugu Sahityam Teasers
K Viswanath Interview Part 1

#kviswanath తో ముఖాముఖీ

కళలకు ప్రాధాన్యం ఇచ్చే దర్శకునిగా పేరుగాంచిన "కళా తపస్వి" K. విశ్వనాథ్ గారితో పరిచయం విందాం. సౌండ్ రికార్డర్ గా తన జీవితాన్ని స్టార్ట్ చేసిన వారు అప్పటి రికార్డింగ్ ఎలా ఉంటుందో, అందులోని కష్ఠాలు చెప్పారు. వీరు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు.విశ్వనాథ్ గారు వారి సినిమాలలో పాటలకు, కళలకు ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చారు? ఇంకా మహదేవన్, ఆదుర్తి సుబ్బారావు, తన నటన, తన దగ్గర పాడిన గాయకుల గురించి ఏం చెప్పారో వినండి ముఖాముఖీలో.

---

#kviswanath తో ముఖా ముఖీ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/pc-k-viswanath

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
13 minutes 7 seconds

Telugu Sahityam Teasers
Kavula Railu | Tilak Kathalu 2

#తిలక్‌కథలు2

దేవరకొండ బాలగంగాధర తిలక్ 

భావ కవులలో అభ్యుదయకవీ, అభ్యుదయ కవుల్లో భావకవీ అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ కథకుడు, నాటక కర్త, కవి. కవులతో కిటకిటలాడుతున్న రైలులో ఎక్కిన ఒక కవిత అనుభవమేమిటో కేవలం ఒకే ఒక్క పేజీలో ఇమిడ్చిన అతి పొట్టి కథ “కవుల రైలు’ కథలో మనం చూస్తాం. రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు. అది అతని స్వభావమైనట్టు. కానీ దాని వెనక ఉన్న కారణం ఏమిటి, అది తెలిసిన ఒకే ఒక్కరు ఎవరు? నవ్వు కథ వింటే గానీ తెలియదు. వినండి. పదహారు కథలున్న ‘తిలక్ కథలు’ రెండవ సంపుటం.

---

#తిలక్‌కథలు2  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/ab-tilak-kathalu-2

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
2 minutes 43 seconds

Telugu Sahityam Teasers
Tondamanudu Kattinchindi Kaadu | Tirumala Charitamrutam | Vol 1

#తిరుమలచారితామృతం

PVRK ప్రసాద్

శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాదు గారు వ్రాసిన ప్రముఖ గ్రంధం 'తిరుమల చరితామృతం' తిరుమల ఇతిహాసం, చరిత్రకు సంబంధించినది. పురాణ కాలంలో ఈ ఆలయ స్వరూపం, మూలవరుల రూపం గురించి శైవులు, వైష్ణవులు, శాక్తేయులు మధ్య వివాదం మొదలైన ఎన్నో ఆసక్తి కలిగించే విషయాలున్న మొదటి 23 అధ్యాయాల ఈ మొదటి భాగాన్ని అందిస్తున్నాము.

---

#తిరుమలచారితామృతం  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/ab-tirumala-charitaamrutam-1

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
19 minutes 18 seconds

Telugu Sahityam Teasers
The Pigeon Project

#దిపిజియన్‌ప్రాజెక్ట్

ఇర్వింగ్ వాలెస్

సృష్టిలోని ప్రతీజీవి భయపడేది మృత్యువుకు అని ధర్మరాజు యక్షునికి సమాధానమిస్తాడు. మరణం లేకుండా ఇంకొన్నేళ్లు బ్రతకాలని ఎవరైనా మందు కనిబెడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే నవల ఇది. సోవియెట్ యూనియన్‌లోని ఆఖభాజియాలో 150 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు 5000మంది ఉన్నారు. మాక్ డోనాల్డ్ ప్రపంచ చరిత్రను మార్చే సిద్ధాంతాన్ని (ఫార్ములా) కనుగొన్నాడు. అతని సహాయకుడు లియోనార్డ్. రష్యా ప్రభుత్వం ఆ ఘనత తమకే చెందాలని ఆ సిద్ధాంతాన్ని బయటకు రానీయకుండా ఒక గూఢచారిని నియమిస్తారు. లియోనార్డ్‌కి ఆ విషయం తెలిసి, డోనాల్డ్‌ను తప్పించి పారిస్ సభకి పంపాలని చూడగా అతను మధ్యలో వెన్నిస్‌లో అక్కడి ప్రభుత్వం వారిచే బందించబడతాడు. డోనాల్డ్ అతనిని బంధించిన చోటకు వచ్చే పావురాలను మచ్చిక చేసుకుని, తనని తప్పించమని ఒక చీటిపై రాసి అది ఆ పావురాలకు కట్టి వాటిని వదులుతాడు. టిమ్ ఒక ఇంజినీర్. సర్వం పోగొట్టుకున్నఅతను 3 ఏళ్లుగా స్తబ్దుగా ఉంటూ డోనాల్డ్‌ను కాపాడే పనిలో పడతాడు. డోనాల్డ్‌ను కాపాడే ప్రయత్నంలో టిమ్ పడే కష్టాలు ఏమిటో? ప్రపంచానికి అతను ఆ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టగలిగాడా? ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి.

---

#దిపిజియన్‌ప్రాజెక్ట్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/pc-the-pegion-project

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
35 minutes 10 seconds

Telugu Sahityam Teasers
Computer | Sastramtho Dosthi 2

#శాస్త్రంతోదోస్తీ2

కోరా 

సౌజన్యంతో  మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎన్నో సంగతులు, సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది ఎందుకు జరిగింది? దీనివెనుక కారణం ఏంటి అనే సందేహాలు అందరికి వస్తాయి. కొన్ని తెలిసినా ఉదాహరణకు సునామి అంటే సముద్రంలో వచ్చే భూకంపం అని తెలుసు కానీ అది ఎలా జరుగుతుంది అనే వాటికి ఇంకా మనకు తెలిసినా,తెలియని కొన్ని ప్రశ్నలకు లోతైన వివరణను కూలంకషంగా కోరా సౌజన్యంతో తెలుసుకుందాం. 

---

#శాస్త్రంతోదోస్తీ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.    https://www.dasubhashitam.com/ab-title/pc-sastram-tho-dosthi

---

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
14 minutes 1 second

Telugu Sahityam Teasers
Dopidi Bhayam | Rendu Mahanagaralu

#రెండుమహానాగరాలు

అనువాదం : తెన్నేటి సూరి

రాజు సరిలేని రాజ్యం చిందరవందరగా ఉంటుంది. అందుకే మహాభారతంలో భీష్ముణి శపథం అడ్డురాగా, వ్యాసుడ్ని బతిమాలి సత్యవతి వంశవృద్ధి చేస్తుంది. సింహాసనం పై ఉన్న రాజుకు అన్ని విద్యలు వచ్చి, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా ఉండాలి. రాజు నియంతలా ఉన్నా, ఏం చేతకాని వాడైనా ఆ రాజ్యం ఎలా ఉంటుందో ఈ నవలలో వినవచ్చు. ఫ్రాన్స్‌లో నివసించే జమిందారీ వంశం వారు న్యాయం చేస్తున్నానని ప్రజల్నిపీడించే విధానము ఆ వంశం లోని యువరాజు అయిన డార్నేకు నచ్చక, ఆ పరిస్థితులను తట్టుకోలేక లండన్ కి వెళ్లి తన పేరు మార్చుకొని, పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ జీవించేవాడు. ఈ ఫ్రాన్స్ జమీందార్ల రాజరికానికి బలైన ఒక డాక్టర్ మాన్సియర్ మానెట్. అతని ఒక్కగానొక్కకూతురు, అతి సౌందర్యవతి అయిన లూసిని డార్నే పెళ్లి చేసుకుంటాడు. ఈ ఫ్రాన్స్ వంశస్థుల వారిచే మానెట్ పడ్డ కష్టం, ఎంతో పేరుగల మానెట్ మానసికపరిస్థితి ని బాగుచేయడానికి లూసీ, టెక్సాస్ బ్యాంకు మేనేజర్ లారీ చేసిన ప్రయత్నం ఈ భాగంలో వినండి.

---

##రెండుమహానాగరాలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/ab-rendu-mahaanagaralu-1

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
20 minutes 31 seconds

Telugu Sahityam Teasers
Devatala Tirugubatu | Mangayya Adrushtam

#మంగయ్యఅదృష్టం

పి.వి.నరసింహారావు   

శ్రీ పి.వి.నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత ప్రధాన మంత్రిగానే కాకుండా బహు భాషా కోవిదునిగా గొప్ప వక్తగా, రచయితగా ఎరుగని భారతీయుడు ముఖ్యంగా తెలుగువారు ఉండరు. వారు వ్రాసిన ‘ద ఇన్ సైడర్’ నవల ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యాభిమానుల విశేషమైన ప్రసంశలను పొందింది. అలాగే, సుప్రసిద్ధ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలలో మొట్ట మొదటి తెలుగు వారైన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్ర ఫణ్’ పేరిట హిందీలోకి వారు చేసిన అనువాదం శ్రీ నరసింహారావుగారికి హిందీ సాహితీరంగంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. నాటినుంచి నేటివరకూ తత్కాలీన రాజకీయాలు, నాయకుల తీరుతెన్నులకు ప్రతిబింబించే నవలిక చాలా కాలం క్రితం శ్రీ పి.వి. నరసింహారావు గారే వ్రాసిన ‘మంగయ్య అదృష్టం.’ బ్రహ్మదేవుని ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రతికూల వర్గాలుగా విడిపోయిన ఇతర దేవతలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి ఒక రాజకీయ నాయకుని కేంద్రంగా చేసుకుని చేసిన విన్యాసాలు ఈ కథ ఇతివృత్తం. సునిశితమైన హాస్యంతో సాగే ఈ కథలో చివరకు ఆధిపత్యం ఎవరి పక్షాన ఉన్నదో, పరాజిత పక్షం తీసుకున్న ఆ తీవ్రమైన నిర్ణయం తేలుస్తుంది. ప్రతి తెలుగు అభిమానీ తప్పక చదవ వలసిన ఈ కథను మీకు శ్రవణ రూపంలో అందిస్తోంది దాసుభాషితం. వినండి ‘మంగయ్య అదృష్టం’. 

--- 

#మంగయ్యఅదృష్టం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.    https://www.dasubhashitam.com/ab-title/ab-mangayya-adrushtam  

–––  

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   

---  

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
26 minutes 7 seconds

Telugu Sahityam Teasers
All india Radio | Potturi Vijayalakshmi hasya kathalu

#పొత్తూరివిజయలక్ష్మిహాస్యకథలు

పొత్తూరి విజయలక్ష్మి  

హాస్య రచనలకి చిరునామా శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి. 1982లో ఆమె వ్రాసిన తొలి నవల ‘ప్రేమలేఖ’ తోనే పొత్తూరి విజయలక్ష్మి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ నవల ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాగా అఖండ విజయం సాధించింది. ఆ విధంగా ప్రారంభం అయిన ఆమె సాహితీ యాత్ర నేటికీ జయప్రదంగా కొనసాగుతూనే వుంది. ఇంతవరకు 20 నవలలు, 250 కధలు, ఎన్నో కాలమ్స్ రాశారు. ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించిపెట్టినవి "పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు." సుమారు పదహారేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం ఎడిషన్ లో ధారావాహికం గా వెలువడిన ఈ కధలు విశేషమైన పాఠకాదరణ పొందాయి. పెళ్ళిళ్ళ లో రిటర్న్ గిఫ్ట్ గా పుస్తకాలను పంచిపెట్టడం అనే ఒక సత్సంప్రదాయం ఈ పుస్తకంతో మొదలైంది. ఆ విధంగా లక్షలాది మంది తెలుగు పుస్తక ప్రియులకు ప్రీతిపాత్రమై విజయలక్ష్మి గారికి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టిన పుస్తకాన్ని మొదటి సారి శ్రవణ రూపంలో మీ ముందుకు తెస్తున్నది ‘దాసుభాషితం’. వినండి. ‘పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు’ శ్రవణ పుస్తకం. శ్రవణానువాదం, గళం: హిమజ సుమన్. 

--- 

#పొత్తూరివిజయలక్ష్మిహాస్యకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.    

https://www.dasubhashitam.com/ab-title/ab-potturi-vijayalakshmi-hasya-kathalu-1

–––  

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   

---  

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
7 minutes 37 seconds

Telugu Sahityam Teasers
Chematalu Pattinchina Bind Over | Asalem Jarigindante...

#అసలేంజరిగిందంటే

పి.వి.ఆర్.కె.ప్రసాద్  

శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాడు గారు జగమెరిగిన మాజీ ఐఏయస్ అధికారి. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టరు మొదలుకుని, భారత ప్రధానికి మీడియా సలహాదారుగానూ, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యెక ప్రధాన కార్యదర్శి గానూ వివిధ హోదాల్లో పనిచేసి పనితీరులో తనదంటూ ఒక ముధ్రనూ ఒరవడినీ ఏర్పరచారు. సుమారు నలల్భై సంవత్సరాల సుదీర్ఘ పదవీ కాలంలో పొందిన అనుభవాల, అనుభూతుల అక్షర రూపం 'అసలేం జరిగిందంటే'. ఇప్పుడు శ్రవణ రూపంలో వినండి. 

--- 

#అసలేంజరిగిందంటే శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.    https://www.dasubhashitam.com/ab-title/ab-asalem-jarigindante

–––  

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.   ---  ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
11 minutes 11 seconds

Telugu Sahityam Teasers
Julapala Katha | Americomedy Kathalu 1

#అమెరికామెడీకథలు

వంగూరి చిట్టెన్ రాజు

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన టెక్సాస్ రాష్ట్రం లోని హ్యూస్టన్ నగరంలో నివసించే శ్రీ వంగూరి చిట్టెంరాజు గారు తెలుగు రాష్ట్రాల్లో కంటే యావత్తు అమెరికాలో నివసించే తెలుగువారికి పరిచయం అవసరం లేని ఇద్దరు ముగ్గురు ప్రముఖుల్లో ఒకరు. వృత్తి రీత్యా ఇంజనీరు. ప్రముఖంగా చెప్పుకోదగిన సాహితీవేత్త. రచయిత. కలకాలం నిలిచి ఉండే వందకు పైగా కధలు వ్రాశారు. అన్నీ అమెరికా నేపథ్యంలో హాస్య ప్రధానంగా వ్రాసినవి. ప్రముఖ రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావుగారి సుప్రసిద్ధ ‘వందేళ్ల కథకు వందనాలు’ కార్యక్రమంలో ప్రస్తావించిన నూరు తెలుగు కథల్లో, శ్రీ చిట్టెన్ రాజు గారు 1977 లో వ్రాసిన జులపాల కథ ఉన్నదంటే ఆ కథలు ఎంత ప్రముఖమైనవో తెలుస్తుంది. వ్రాసిన శతాధిక కథలను శ్రవణ రూపంలో అందించడానికి సంకల్పించిన దాసుభాషితం శ్రీ చిట్టెన్ రాజు గారిని సంప్రదించగా, తక్షణమే తన అంగీకారాన్ని తెలిపారు. ఆ క్రమంలో మీ ముందుకు వస్తున్నవే ఈ 'అమెరికామెడీ కథలు." వినండి "అమెరికామెడీ కథలు. మొదటి సంపుటం.

---

#అమెరికామెడీకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/ab-americomedykathalu-1

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
10 minutes 28 seconds

Telugu Sahityam Teasers
The Eleventh Commondment

#ఎలవంత్‌కమాండ్మెంట్ 

జెఫ్రీ ఆర్చర్

ఒక వస్తువుపైగాని, పదవిపైగాని, మనిషిపైగాని అతి వ్యామోహం ఉంటే అది ఎంతదాకా దారితీస్తుందంటే వారి ప్రాణాలు తీసేదాకా. ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడడం కోసం కొన్ని సూత్రాలు, నియమాలు కలిగి ఉండాలి. అదీ దూతలుగా ఉన్నవారికి ఇంకా ఎక్కువగా ఉంటాయి ఈ షరతులు. వీరు ప్రాధమికంగా 10 సూత్రాలను పాటించాలి. ఈ నవల విశ్లేషణలో ఇంకో సూత్రాన్ని చెబుతారు. కొన్నార్ గూఢచారి విభాగంలో పనిచేస్తూ పైకి ఆ విషయం తెలీనీకుండా LIC లో ఏజెంట్ పని చేస్తున్నట్టు అందర్నీ, ఆఖరికి భార్య మగ్గీని కూడా నమ్మిస్తాడు. ఈ గూఢచారి విభాగంలో అత్యున్నత స్థానంలో ఉన్నహెలెన్ తన పదవిని కాపాడుకోడం కోసం, తన తరవాత ఆ పదవిలోకి రాబోతున్న కొన్నారను పాములావాడి, ఎంతో చాకచక్యంగా తన అధికారంతో అతనిచే ప్రధానిని హత్యచేయిస్తుంది. ఎన్నో అధికారాలు ఉన్న ప్రధానులు, రాష్ట్రపతులు కూడా ఆమెను ఎందుకు ఎదుర్కోలేకపోయారు? హెలెన్ వేసిన పథకంలోంచి కొన్నారు బయటపడతాడా? హెలెన్ యొక్క నిజస్వరూపం ఎలా బయటపడుతుంది? ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి. 

---

#ఎలవంత్‌కమాండ్మెంట్  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/pc-eleventh-commandment

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
33 minutes 1 second

Telugu Sahityam Teasers
Palla Durgayya | Aacharya Devo Bhava 2

#ఆచార్యదేవోభవ2

డా.ఆర్.అనంత పద్మనాభరావు

చిరంజీవయినా పుడుతూనే మెగాస్టార్ ఐపోలేదయ్యా... తెగించే సత్తా చూపందే సడన్గా స్వర్గం రాదయ్యా... ఈ లిరిక్స్ మనీ అనే సినిమాలో ఒక పాటలోనివి. ఒక మామూలు మనిషిగా పుట్టి ఎన్నో కష్టాలకు ఓర్చి నేర్చిన కళలని ప్రదర్శించి ప్రేక్షకులని ఉల్లాసపరిచి ఒక గొప్ప హీరోగా ఎదిగిన వ్యక్తిపై రాసిన లిరిక్స్. డా. ఆర్. అనంత పద్మనాభారావుగారు రాసిన ఆచార్య దేవో భవ వ్యాసములలో ఇలా ఎందరో ఆచార్యులను గురించి మనకి తెలియజేశారు. ఒక గొప్ప ఆచార్యునిగా వారు ఎదిగిన స్థితి, ఆచార్యునిగా వారు చేసిన పరిశోధనలు కృషి విద్యార్థులు దృష్టిలో ఒక హీరోగా ఎదిగిన తీరుకి ఏమాత్రం తక్కువ కాదు. ఈ శీర్షికలోని వ్యాసాలను వింటుంటే ఎందరో ఆచార్యులు ఆంధ్ర దేశంలో మనం ఉంటున్న ఊర్లో నుండి మనం తిరిగిన ఊర్లలో నుండి ఎన్నో యూనివర్శిటీలకు చేరి శాస్త్రం, చరిత్ర, నాట్యం, నటన, ఇలా ఎన్నో కళలలో, విద్యలలో వారు చేసిన పరిశోధన, కృషి గురించి వివరిస్తూ ఉంటే ఆచార్యులని ఆచార్యులగానే కాక గొప్ప హీరోలుగా మనం చూస్తాం. మరి వారు చేసిన కృషి తెల్సుకోవాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి అనుకుంటే ఆ ఆచార్యులు నడిచిన మార్గం ఏంటో వినండి. 

---

#ఆచార్యదేవోభవ2  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/pc-aacharyadevobhava-2

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
4 minutes 57 seconds

Telugu Sahityam Teasers
Raghupathi Venkataratnam | Aacharya Devo Bhava

#ఆచార్యదేవోభవ

డా.ఆర్.అనంత పద్మనాభరావు

ప్రతీ ఒక్కరికి తల్లి మొదటి గురువైతే, తల్లి ప్రేమను, తండ్రి నేర్పే క్రమశిక్షణను, అపారమైన విద్యను మనకు అందించేవారే గురువులు. మన పూర్వకాలంలో గురు శుశ్రూష చేసి విద్యలను నేర్చుకునేవారు. కృష్ణుడు, రాముడు కూడా ఇలా నేర్చుకున్న వారే. వేదాలు, శాస్త్రాలు సంస్కృతంలో లేక ద్రావిడ భాషలో ఉన్నాయి. వాటిని పూర్తిగా నేర్చున్నవారు చాలా తక్కువగా ఉండేవారు. రాను రాను గురుకులాలకి వెళ్లి నేర్చుకునేవారు, నేర్పేవారు కూడా తగ్గారు. వీటిని జనసామాన్యంలోకి తేవడానికి చాలా మంది కృషి చేసారు. బీద కుటుంబంలో పుట్టినా, చదువుమీద ఆశతో, శాస్త్రం నేర్చుకోవాలన్న పట్టుదలతో ఎందరో వివిధ శాస్త్రాలలో ప్రావీణ్యులయ్యారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అధ్యాపకులుగా ,ఉపకులపతులుగా ఉండి తమకున్న ఆసక్తితో చేసిన పరిశోధనలను, సాహిత్యంపై అనేకులు చేసిన కృషిని ఈ 'ఆచార్యదేవోభవ' లో వినండి.

---

#ఆచార్యదేవోభవ  శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   

https://www.dasubhashitam.com/ab-title/pc-aacharyadevobhava

––– 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

Show more...
2 years ago
7 minutes 7 seconds