
#పొత్తూరివిజయలక్ష్మిహాస్యకథలు
పొత్తూరి విజయలక్ష్మి
హాస్య రచనలకి చిరునామా శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి. 1982లో ఆమె వ్రాసిన తొలి నవల ‘ప్రేమలేఖ’ తోనే పొత్తూరి విజయలక్ష్మి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ నవల ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాగా అఖండ విజయం సాధించింది. ఆ విధంగా ప్రారంభం అయిన ఆమె సాహితీ యాత్ర నేటికీ జయప్రదంగా కొనసాగుతూనే వుంది. ఇంతవరకు 20 నవలలు, 250 కధలు, ఎన్నో కాలమ్స్ రాశారు. ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించిపెట్టినవి "పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు." సుమారు పదహారేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం ఎడిషన్ లో ధారావాహికం గా వెలువడిన ఈ కధలు విశేషమైన పాఠకాదరణ పొందాయి. పెళ్ళిళ్ళ లో రిటర్న్ గిఫ్ట్ గా పుస్తకాలను పంచిపెట్టడం అనే ఒక సత్సంప్రదాయం ఈ పుస్తకంతో మొదలైంది. ఆ విధంగా లక్షలాది మంది తెలుగు పుస్తక ప్రియులకు ప్రీతిపాత్రమై విజయలక్ష్మి గారికి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టిన పుస్తకాన్ని మొదటి సారి శ్రవణ రూపంలో మీ ముందుకు తెస్తున్నది ‘దాసుభాషితం’. వినండి. ‘పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు’ శ్రవణ పుస్తకం. శ్రవణానువాదం, గళం: హిమజ సుమన్.
---
#పొత్తూరివిజయలక్ష్మిహాస్యకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-potturi-vijayalakshmi-hasya-kathalu-1
–––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.