
#దిపిజియన్‌ప్రాజెక్ట్
ఇర్వింగ్ వాలెస్
సృష్టిలోని ప్రతీజీవి భయపడేది మృత్యువుకు అని ధర్మరాజు యక్షునికి సమాధానమిస్తాడు. మరణం లేకుండా ఇంకొన్నేళ్లు బ్రతకాలని ఎవరైనా మందు కనిబెడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే నవల ఇది. సోవియెట్ యూనియన్‌లోని ఆఖభాజియాలో 150 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు 5000మంది ఉన్నారు. మాక్ డోనాల్డ్ ప్రపంచ చరిత్రను మార్చే సిద్ధాంతాన్ని (ఫార్ములా) కనుగొన్నాడు. అతని సహాయకుడు లియోనార్డ్. రష్యా ప్రభుత్వం ఆ ఘనత తమకే చెందాలని ఆ సిద్ధాంతాన్ని బయటకు రానీయకుండా ఒక గూఢచారిని నియమిస్తారు. లియోనార్డ్‌కి ఆ విషయం తెలిసి, డోనాల్డ్‌ను తప్పించి పారిస్ సభకి పంపాలని చూడగా అతను మధ్యలో వెన్నిస్‌లో అక్కడి ప్రభుత్వం వారిచే బందించబడతాడు. డోనాల్డ్ అతనిని బంధించిన చోటకు వచ్చే పావురాలను మచ్చిక చేసుకుని, తనని తప్పించమని ఒక చీటిపై రాసి అది ఆ పావురాలకు కట్టి వాటిని వదులుతాడు. టిమ్ ఒక ఇంజినీర్. సర్వం పోగొట్టుకున్నఅతను 3 ఏళ్లుగా స్తబ్దుగా ఉంటూ డోనాల్డ్‌ను కాపాడే పనిలో పడతాడు. డోనాల్డ్‌ను కాపాడే ప్రయత్నంలో టిమ్ పడే కష్టాలు ఏమిటో? ప్రపంచానికి అతను ఆ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టగలిగాడా? ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి.
---
#దిపిజియన్‌ప్రాజెక్ట్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-the-pegion-project
–––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.