
#మంగయ్యఅదృష్టం
పి.వి.నరసింహారావు
శ్రీ పి.వి.నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత ప్రధాన మంత్రిగానే కాకుండా బహు భాషా కోవిదునిగా గొప్ప వక్తగా, రచయితగా ఎరుగని భారతీయుడు ముఖ్యంగా తెలుగువారు ఉండరు. వారు వ్రాసిన ‘ద ఇన్ సైడర్’ నవల ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యాభిమానుల విశేషమైన ప్రసంశలను పొందింది. అలాగే, సుప్రసిద్ధ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలలో మొట్ట మొదటి తెలుగు వారైన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్ర ఫణ్’ పేరిట హిందీలోకి వారు చేసిన అనువాదం శ్రీ నరసింహారావుగారికి హిందీ సాహితీరంగంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. నాటినుంచి నేటివరకూ తత్కాలీన రాజకీయాలు, నాయకుల తీరుతెన్నులకు ప్రతిబింబించే నవలిక చాలా కాలం క్రితం శ్రీ పి.వి. నరసింహారావు గారే వ్రాసిన ‘మంగయ్య అదృష్టం.’ బ్రహ్మదేవుని ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రతికూల వర్గాలుగా విడిపోయిన ఇతర దేవతలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి ఒక రాజకీయ నాయకుని కేంద్రంగా చేసుకుని చేసిన విన్యాసాలు ఈ కథ ఇతివృత్తం. సునిశితమైన హాస్యంతో సాగే ఈ కథలో చివరకు ఆధిపత్యం ఎవరి పక్షాన ఉన్నదో, పరాజిత పక్షం తీసుకున్న ఆ తీవ్రమైన నిర్ణయం తేలుస్తుంది. ప్రతి తెలుగు అభిమానీ తప్పక చదవ వలసిన ఈ కథను మీకు శ్రవణ రూపంలో అందిస్తోంది దాసుభాషితం. వినండి ‘మంగయ్య అదృష్టం’.
---
#మంగయ్యఅదృష్టం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/ab-mangayya-adrushtam
–––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.