
#అమెరికామెడీకథలు
వంగూరి చిట్టెన్ రాజు
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన టెక్సాస్ రాష్ట్రం లోని హ్యూస్టన్ నగరంలో నివసించే శ్రీ వంగూరి చిట్టెంరాజు గారు తెలుగు రాష్ట్రాల్లో కంటే యావత్తు అమెరికాలో నివసించే తెలుగువారికి పరిచయం అవసరం లేని ఇద్దరు ముగ్గురు ప్రముఖుల్లో ఒకరు. వృత్తి రీత్యా ఇంజనీరు. ప్రముఖంగా చెప్పుకోదగిన సాహితీవేత్త. రచయిత. కలకాలం నిలిచి ఉండే వందకు పైగా కధలు వ్రాశారు. అన్నీ అమెరికా నేపథ్యంలో హాస్య ప్రధానంగా వ్రాసినవి. ప్రముఖ రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావుగారి సుప్రసిద్ధ ‘వందేళ్ల కథకు వందనాలు’ కార్యక్రమంలో ప్రస్తావించిన నూరు తెలుగు కథల్లో, శ్రీ చిట్టెన్ రాజు గారు 1977 లో వ్రాసిన జులపాల కథ ఉన్నదంటే ఆ కథలు ఎంత ప్రముఖమైనవో తెలుస్తుంది. వ్రాసిన శతాధిక కథలను శ్రవణ రూపంలో అందించడానికి సంకల్పించిన దాసుభాషితం శ్రీ చిట్టెన్ రాజు గారిని సంప్రదించగా, తక్షణమే తన అంగీకారాన్ని తెలిపారు. ఆ క్రమంలో మీ ముందుకు వస్తున్నవే ఈ 'అమెరికామెడీ కథలు." వినండి "అమెరికామెడీ కథలు. మొదటి సంపుటం.
---
#అమెరికామెడీకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-americomedykathalu-1
–––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.