
#ఆచార్యదేవోభవ
డా.ఆర్.అనంత పద్మనాభరావు
ప్రతీ ఒక్కరికి తల్లి మొదటి గురువైతే, తల్లి ప్రేమను, తండ్రి నేర్పే క్రమశిక్షణను, అపారమైన విద్యను మనకు అందించేవారే గురువులు. మన పూర్వకాలంలో గురు శుశ్రూష చేసి విద్యలను నేర్చుకునేవారు. కృష్ణుడు, రాముడు కూడా ఇలా నేర్చుకున్న వారే. వేదాలు, శాస్త్రాలు సంస్కృతంలో లేక ద్రావిడ భాషలో ఉన్నాయి. వాటిని పూర్తిగా నేర్చున్నవారు చాలా తక్కువగా ఉండేవారు. రాను రాను గురుకులాలకి వెళ్లి నేర్చుకునేవారు, నేర్పేవారు కూడా తగ్గారు. వీటిని జనసామాన్యంలోకి తేవడానికి చాలా మంది కృషి చేసారు. బీద కుటుంబంలో పుట్టినా, చదువుమీద ఆశతో, శాస్త్రం నేర్చుకోవాలన్న పట్టుదలతో ఎందరో వివిధ శాస్త్రాలలో ప్రావీణ్యులయ్యారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అధ్యాపకులుగా ,ఉపకులపతులుగా ఉండి తమకున్న ఆసక్తితో చేసిన పరిశోధనలను, సాహిత్యంపై అనేకులు చేసిన కృషిని ఈ 'ఆచార్యదేవోభవ' లో వినండి.
---
#ఆచార్యదేవోభవ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-aacharyadevobhava
–––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.