ఒక సృష్టికర్తగా మీ జీవితాన్ని మీరేలా సృష్టించుకుంటున్నారో తెలుసా మీకు???
గతాన్ని మార్చి...భవిష్యత్తుని మారిపోయేలా చేసే రివిషన్ టెక్నిక్ | Manifestation in Telugu - 1
ఇది అమెరికాలో dirt bike race లలో raising star అని గుర్తింపు పొందుతూ, ఆ ఆటలో ఉన్నత శిఖరాలకు చేరాలని కలలు కంటూ, అందుకు అనుక్షణం పాటు పడుతూ, అనవసరమైన అసూయకు బలయిన 25 ఏళ్ల మొ విల్సన్ కథ. తాను ప్రేమించిన మనిషి తనను ప్రేమించడం లేదు, కేవలం వాడుకుంటున్నాడు అని గుర్తించకుండా తన జీవితంతో పాటు, వేరొకరి జీవితాన్ని కూడా నాశనం చేసిన Kaitlin Armstrong కథ. చివరికి, తన స్వార్ధం కోసం తనను ప్రేమించిన మనిషి మనసుతో ఆటలాడుకున్న Colin Strickland కథ. Love triangle అనేది మనం సర్వ సాధారణంగా సినిమా లలో, సీరియల్ లలో చూస్తూ నవ్వుకుంటాం. కానీ అది నిజ జీవితానికి పాకితే, దాని ఫలితం ఒక నిండు ప్రాణం బలి కోరితే, అది అంతులేని విషాదం. ఆ విషాదం ఎందుకు, ఎప్పుడు, ఎలా జరిగింది అనేది ఈ రోజు తెలుసుకుందాం.
Change your Thoughts to Change your Life | కొత్త ఆలోచనా విధానం - 7
You have life after 40 | Make new Plans| Have new Life | కొత్త ఆలోచనా విధానం - 5
మీ పెళ్లి ఒక వ్యాపారం వచ్చే పెళ్లిరోజు కాంట్రాక్ట్ రాసుకోండి | కొత్త ఆలోచనా విధానం 4
మీ కోసం మీరు తీసుకుంటున్న నిర్ణయాయలేంటి | కొత్త ఆలోచనా విధానం - 3
మీ జీవితంలో మీ స్థానం ఏంటి? | కొత్త ఆలోచనా విధానం - 2
Greek Mythology in Telugu_...Eros Love Story in Telugu | స్టోరీ 9 | Eros Story | Part - 1
మీ దృష్టిలో మీ జీవితం అంటే ఏంటి | కొత్త ఆలోచనా విధానం - 1
Greek Mythology in Telugu_...ఆర్ఫియస్ కథ | స్టోరీ 8 | Orpheus Story from Greek Myth సంగీతానికి అధిపతి అయిన అపోలో కంటే అందమైన పాటలు పడే మామూలు మనిషి ఆర్ఫియస్, తన సంగీత పరికరమైన లైర్ ని వాయిస్తూ, అతను పాట పాడితే, ఆ పాట వినిపించినంత దూరం, ప్రతి జీవి చెవులు విప్పుకుని వినేవారు. పక్షులు కీలకిలాలలో అతని పాటలో పాత కలిపితే, నెమల్లు ఆ పాటకి పూరివిప్పి నాట్యం ఆడేవి. అంతా అందమైన పాటలు పాడే అతని ప్రాణం, యూరుడశి. వయసుకొచ్చాక సంపాదనకోసం దేశాలు పట్టుకు తిరిగిన ఆర్ఫియస్, తనకు సరిపడెంత సంపాదించాక తిరిగి తన ఊరికి వచ్చి, తన ప్రేయసి యూరుడశి ని పెళ్లి చేసుకున్నాడు. ఒకరంటే ఒకరు ప్రాణంలా ఉండే ఆ జంటను చూసి అందరు మూరుసిపోయేవారు. కఠినమైన మనసున్నవారుకూడా, వారెప్పుడు కలిసి ఉండాలని కోరుకునేవారు. కానీ, అంతా మంచిగా సాగితే కతెమ ఉంటుంది చెప్పండి. #telugustories, #storiesintelugu, #teluguquotes, #teluguthoughts9, #telugupuranalu, #greekmythologyintelugu, #telugumythology, #mythologyintelugu, #pandorastory telugustories, storiesintelugu, teluguquotes, teluguthoughts9, telugupuranalu, greekmythologyintelugu, telugumythology, mythologyintelugu, pandorastory
అమెరికన్ క్రైమ్ స్టోరీస్ | Episode 3 | నమ్మక ద్రోహానికి బలైన మైక్ విలియమ్స్ కథ | Mike Williams ఎంతో మంది గొప్ప గొప్ప స్నేహితులున్న ఈ ప్రపంచంలో, స్నేహానికి మచ్చని మిగులుస్తూ కొంతమంది స్నేహం పేరుతో శత్రువుల కంటే దారుణంగా వెన్ను పోటు పొడుస్తారు. అలాంటి స్నేహితుడిని పొందిన దూరదృష్టవంతుడు Jerry Michael Williams, అందరూ అతన్ని Mike అని పిలుస్తారు. ఈ కథలో మనకు మోసం, ద్రోహం మాత్రమే కాదు, ఒక తల్లి కడుపుకోత, ఆ తల్లి తన కొడుకు కోసం చేసిన న్యాయపోరాటం, ఆ న్యాయం కోసం ఆమె అహర్నిశలు 17 ఏళ్ల పాటు, 1 కాదు, 2 కాదు, 17 ఏళ్ల పాటు పడిన తపన ఉన్నాయి. చివరికి ఈ కథలో ఆ తల్లి యొక్క గెలుపు ఉంది. రకరకాల మలుపులతో సాగిన ఈ కథ 5 లేదా 10 నిమిషాలలో పూర్తికాదు. కాబట్టి ఆలస్యం చెయ్యకుండా ఈ అమెరికన్ మర్డర్ స్టోరీలోకి వెళ్లిపోదాం . telugu crime stories, #telugucrime,
ఈ కథ కోసం మనం కొంచెం సేపు పాతాళానికి వెళదాం. Cronus నుండి అధికారం లాక్కున్న తరువాత అతని ముగ్గురు కొడుకులు, భూమిని మీద పాలనని తమ మధ్య పంచుకున్నారు. జియుస్ ఆకాశాన్ని, భూమిని పైన ఉన్న జీవజాతికి అధిపతిగా మారితే, Posideon సముద్రాలని, అందులో ఉన్న జీవ జాతులను ఆక్రమించుకున్నాడు. ఇక మిగిలిన భూ అంతర్భాగంలో ఉన్న పాతాళ లోకం యోక్క అధికారాన్ని హెడిస్ చేజిక్కిచ్చుకున్నాడు. మొదట్లో తన భాగం కింద శూన్యం తో నిండి ఉన్న పాతాళం రావడాన్ని అస్సలు ఇష్టపడలేదు హెడిస్, కానీ జియుస్ “భవిష్యత్తులో భూమి మీద ఉన్న ప్రతి జీవ జాతి చివరికి పాటలానికే రావాల్సి వస్తుంది, వారందరూ నీ పాలనలో ఉంటారు” అని నచ్చ చెప్పడంతో, తన పదవిని అభిమానించడం మొదలుపెట్టాడు హెడిస్. భవిష్యత్తులో తన పాలనలోకి వచ్చే ఆత్మలకోసం పాతాళం లో మూడు లోకాలను సృష్టించాడు అతను, అందులో ఒక లోకంలో అద్భుతంగా, ధైర్యంగా, వేరేవారు మంచికోసం బ్రతికిన వారిని ప్రశాంతంగా గడపడానికి పంపితే, రెండవ లోకంలోకి మామూలుగా, సాధారణంగా, బ్రతికిన వారిని పంపేవారు. చివరిగా మూడవ లోకంలోకి, పాపాలు చేసి, పక్కవారిని నాశనం చేసీ వారిని శిక్షించేందుకు పంపేవారు, మనకి నరకం ఎలాగో, ఆ మూడవ లోకం అలాగా.
పాన్డోరా పుణ్యమా అని లోకంలోకి రోగాలు, దుర్మార్గాలు చెరిపోయాయి. మరో వైపు జియుస్ ని దేవతలందరు ప్రాధేయపడటంతో అతను Prometheous ని తన శిక్ష నుండి విడుదల చేశాడు. స్త్రీ రాకతో ప్రపంచంలో మానవ జీవితం మొదలయ్యింది. మనుషులు జత కట్టడం, పిల్లల్ని కనడం, కుటుంబ బంధాలు, రాజ్యాలు, రాజులు, పట్టణాలు, పాలన, అన్నీ మొదలయ్యాయి. Pandora మరియు Epimetheous లకు కూడా పిల్లలు పుట్టారు. వారికి పుట్టిన పిల్లలలో ఒకరు PYRRHA, వారి కూతురు, మరియు మనం చెప్పుకుంటున్న ఈ కథలో ముఖ్య పాత్రధారి. మరోవైపు Prometheous కి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు DEUCALION. తన తోబుట్టువుతో, మరియు తన కొడుకుతో సంతోషంగా తాను సృష్టించిన మనిషి ఎదుగుదల చూస్తూ జీవిస్తున్న Prometious మనసులో, ఏదో ఒక రోజు మనిషి ఎదగడం చూసి జియుస్ కి ఈర్ష్య కలిగి, వారికి హాని కలిగించవచ్చెమొ అన్న అనుమానం మొదలయ్యింది. ముందు జాగ్రత్తకి తాను తన కొడుకుని అడవిలోకి తీసుకు వెళ్ళి అతనికి అత్యవసరమైన సమయంలో బ్రతకడానికి అవసరమైన చేతిపానులన్నీ నేర్పడమేకాక, తండ్రి కొడుకు కలిసి, మనుషులు బ్రతకడానికి సరిపోయేంత పెద్ద చెక్క పెట్టేని సృష్టించారు. అందులో కొన్ని సంవత్సరాలకు సరిపడా సరుకులు సర్ది, ఆ పెట్టెని జాగ్రత్తగా దాచిపెట్టారు. వయసుకొచ్చిన DEUCALION మరియు PYRRHA ఒకరిని ఒకరు ఇష్టపడటంతో, వారిద్దరికీ సంతోషంగా పెళ్లి చేశారు Prometheous అండ్ Epimetheous.
తన కొడుకైన Hephaestus, ని పిలిచి ఒక అందమైన స్త్రీ ని సృష్టించమని అడిగాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఎంతో శ్రద్ధగా అమ్మాయిని సృష్టించడం మొదలు పెట్టిన Hephaestus తన తల్లి, హెరా, శృంగార దేవత Aprodiety మరియు తన తోబుట్టువయిన Athena లలో ఉన్న అందమైన రూపు రేఖలను తాను సృష్టిస్తున్న అమ్మాయికి ఇచ్చాడు.
మానవ జాతిని సృష్టించాలీ అన్న ఐడియా జియుస్ కి వచ్చినప్పుడు, ఆ ఆలోచనని నిజం చేయగల సమర్ధత ఉన్న వ్యక్తి Prometheus మాత్రమే అని నమ్మి అతన్ని కలిశాడు. దేవతల రూపురేఖలతో, ఒక చిన్న సైజ్ జీవ జాతిని సృష్టించమని, వారికి సొంతగా ఆలోచించే శక్తి మరియు దైవత్వం మీద నమ్మకం, భయం ఇవ్వమని Prometheus ని అడిగాడు.
జియుస్ కోరిన ప్రకారం, Prometheus వెంటనే భూమంతా చుట్టి మంచి మట్టి ఉన్న చెరువు అంచులో కూర్చుని, జాగ్రత్తగా అక్కడ ఉన్న మట్టితో మనిషి ఆకారం సృష్టించాడు. రకరకాల మట్టులతో రకరకాలా ఆకారాలను సృష్టించి వాటిని ఆరబెట్టాడు. సాయంత్రమయ్యేటప్పటికి అక్కడికి తన కూతురైన Athena తో చేరుకున్న జియుస్. Prometheus సృష్టిని చూసి ఉప్పొంగిపోయాడు, Athena ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేసింది. వాళ్ల ఆశ్చర్యానందాలను చూసి గర్వంగా ఫిల్ అయ్యాడు Prometheus.
భూమాత గాయ, ఆకాశానికి అధిపతి అయిన యురేనస్ లకు పుట్టిన 12 మంది దేవతలలో చివరి వాడు Cronus, పుట్టుకతోనే అతను సమయానికి అధిపతి. మనం ఇంతక ముందు వీడియొ లో చెప్పిన దాని ప్రకారం యురేనస్ ని ఓడించిన cronus ఆకాశాన్ని, స్వర్గాన్ని ఆక్రమించుకుని, తనని తాను వాటికి అధిపతిగా ప్రకటించుకున్నాడు. అతని సైన్యం, అతని 11 మంది తోబుట్టువులైన టైటన్స్.
సాధారణంగా ధైర్యానికి విజయం తోడైనప్పుడు చాలామందిలో అహం మొదలవుతుంది. వారికి ఓటమి లేదు అనిపిస్తుంది. ఆ ఆహాన్ని అదుపు చేసుకోలేకపోతే అదే వారి పతనానికి పునాదిగా మారుతుంది. అదే Cronus విషయంలో జరిగింది. అందరికంటే చిన్నవాడైనా, తండ్రిని ఓడించి ప్రపంచానికి అధిపతిగా మారడంతో, తనకి తిరుగులేదు అని అహం అతనిలో మొదలయ్యింది.
తనకంటూ ఒక తోడు, ప్రేమ కోరుకున్న గాయా, తాను ఎవరిని తన భర్తగా ఎన్నుకోవాలి అని ఆమెలో సంగధిత కలిగినప్పుడు ఆమె మనసులో ఇద్దరు మెదిలారు. ఆమె నుండి ఉద్భవించిన ఆ ఇద్దరిలో ఒకరు pontus, మహా సముద్రానికి అధిపతి, ఎప్పుడు ఆవేశం తో అలలతో ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాడు. మరొకరు Uranus, స్వర్గానికి మరియు ఆకాశానికి అధిపతి, ప్రశాంతంగా భూమి అంతటికీ నీడనిస్తూ, సున్నితంగా సహనంతో ఉంటాడు. Uranus లో ఉన్న సహనాన్ని, సున్నితత్వాన్ని గాఢంగా ఇష్టపడిన గాయా, అతన్ని తన భర్తగా ఎన్నుకుంది.