
భూమాత గాయ, ఆకాశానికి అధిపతి అయిన యురేనస్ లకు పుట్టిన 12 మంది దేవతలలో చివరి వాడు Cronus, పుట్టుకతోనే అతను సమయానికి అధిపతి. మనం ఇంతక ముందు వీడియొ లో చెప్పిన దాని ప్రకారం యురేనస్ ని ఓడించిన cronus ఆకాశాన్ని, స్వర్గాన్ని ఆక్రమించుకుని, తనని తాను వాటికి అధిపతిగా ప్రకటించుకున్నాడు. అతని సైన్యం, అతని 11 మంది తోబుట్టువులైన టైటన్స్.
సాధారణంగా ధైర్యానికి విజయం తోడైనప్పుడు చాలామందిలో అహం మొదలవుతుంది. వారికి ఓటమి లేదు అనిపిస్తుంది. ఆ ఆహాన్ని అదుపు చేసుకోలేకపోతే అదే వారి పతనానికి పునాదిగా మారుతుంది. అదే Cronus విషయంలో జరిగింది. అందరికంటే చిన్నవాడైనా, తండ్రిని ఓడించి ప్రపంచానికి అధిపతిగా మారడంతో, తనకి తిరుగులేదు అని అహం అతనిలో మొదలయ్యింది.