
మానవ జాతిని సృష్టించాలీ అన్న ఐడియా జియుస్ కి వచ్చినప్పుడు, ఆ ఆలోచనని నిజం చేయగల సమర్ధత ఉన్న వ్యక్తి Prometheus మాత్రమే అని నమ్మి అతన్ని కలిశాడు. దేవతల రూపురేఖలతో, ఒక చిన్న సైజ్ జీవ జాతిని సృష్టించమని, వారికి సొంతగా ఆలోచించే శక్తి మరియు దైవత్వం మీద నమ్మకం, భయం ఇవ్వమని Prometheus ని అడిగాడు.
జియుస్ కోరిన ప్రకారం, Prometheus వెంటనే భూమంతా చుట్టి మంచి మట్టి ఉన్న చెరువు అంచులో కూర్చుని, జాగ్రత్తగా అక్కడ ఉన్న మట్టితో మనిషి ఆకారం సృష్టించాడు. రకరకాల మట్టులతో రకరకాలా ఆకారాలను సృష్టించి వాటిని ఆరబెట్టాడు. సాయంత్రమయ్యేటప్పటికి అక్కడికి తన కూతురైన Athena తో చేరుకున్న జియుస్. Prometheus సృష్టిని చూసి ఉప్పొంగిపోయాడు, Athena ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేసింది. వాళ్ల ఆశ్చర్యానందాలను చూసి గర్వంగా ఫిల్ అయ్యాడు Prometheus.