All content for AksharaNITT is the property of akshara and is served directly from their servers
with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
మన తాతయ్య మనకి కథ చెప్తే,
అది తెలిసిన కథ అయినా సరే మళ్ళీ వినాలనిపిస్తుంది...
అలాంటిది వాళ్ళు మనతోనే ముచ్చటిస్తే...
సమయం కూడా తెలియదు కాదా...
ఇక రాఘవయ్య గారి మరిన్ని అనుభవాలను, జ్ఞాపకాలను విందాం మా ఈ మధురానుభావాలు episode 2 ద్వారా విందాం...
Credits
Content : Yashwanth
Dubbing : Yashwanth
Editing : Aditya
అలాగే తెలుగు భాష మరియు తెలుగు సంస్కృతికి సంబందించిన అనేక ఆసక్తికర విషయాల కోసం aksharanitt.com చూడండి.
మన తాతయ్య మనకి కథ చెప్తే , అది తెలిసిన కథ అయినా సరే మళ్ళీ వినాలనిపిస్తుంది..అలాంటిది వాళ్ళు మనతోనే ముచ్చటిస్తే..సమయం కూడా తెలియదు కాదా..మీకు అలాంటి అనుభవాలను పంచాలని ఒక ఆడియో సీరీస్ ని మీ ముందుకు తీసుకొస్తుంది అక్షర...ఇక రాఘవయ్య గారి అనుభవాలను, జ్ఞాపకాలను విందాం ఈ Podcast ద్వారా...
మన తాతయ్య మనకి కథ చెప్తే , అది తెలిసిన కథ అయినా సరే మళ్ళీ వినాలనిపిస్తుంది..అలాంటిది వాళ్ళు మనతోనే ముచ్చటిస్తే..సమయం కూడా తెలియదు కాదా..మీకు అలాంటి అనుభవాలను పంచాలని ఒక ఆడియో సీరీస్ ని మీ ముందుకు తీసుకొస్తుంది అక్షర...ఇక రాఘవయ్య గారి అనుభవాలను, జ్ఞాపకాలను విందాం ఈ Podcast ద్వారా...
మాతృమూర్తికి మారుపేరు, సేవాభావం, ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పానికి చిహ్నం ఈమె, ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించిన ఒంటరి మహిళ. ఆమే Sindhutai sapkal. Mai(maa) & Mother of orphans గా పిలవబడే ఈ ఆదర్శవంతమైన మహిళ యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి.
రోడ్డుకి రైట్ సైడ్ లో దిగకూడదు అని విక్రమ్ కి తెలియనిది కాదు, మేము కొత్తగా చెప్పేది కూడా ఏం ఉండదు. వంద లో 99 మంది అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఆ 100 వ వాడు తప్పు చేస్తే చెల్లుబాటు కాదు ఇక్కడ. నిర్లక్ష్యుల విలువ ప్రాణాలు. సరిగ్గా రూల్స్ ని పాటిస్తే చాలు మనతో పాటు మన తోటి వారి ప్రాణాలు కూడా కాపాడవచ్చు.
"నిర్లక్ష్యుల విలువ ప్రాణాలు" అర్థానికి అద్దం పట్టే ఈ వీడియోని మీ ముందుకు తీసూకోస్తుంది మన అక్షర
భూమిని కాపాడటానికి ఆకాశం లో కూడా వెళ్లగలిగే వాళ్ళ ధైర్యానికి మరియు సాహసాలకు సలాం...
మీత్యాగం మాకు కంటతడి ఇస్తుంది,
మీ విజయం మాకు ఆనందాన్ని ఇస్తుంది,
మీ పయనం మాకు స్ఫూర్తిని ఇస్తుంది.
ఇలా మన కోసం ఎన్నో సాహసాలు చేస్తూ మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తున్న వైమానిక దళం (Indian Air Force) గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఈ సరికొత్త Podcastని వినండి.
వ్యాస మహర్షి రచించిన మహాభారతంలో నాలుగు వేదాల సారం ఉంది. అందుకే మహాభారతం ఐదోవేదంగా ప్రసిద్ధికెక్కింది. మహాభారతంలోని ఒక్కో పాత్ర మానవాళికి ఒక్కో గొప్ప సందేశాన్ని ఇస్తుంది.
చిన్నతనం నుండే ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, మహాపతివ్రతగా, మాతృప్రేమకు ప్రతీకగా నిలిచిన కుంతీదేవి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడం కోసం ఈ వీడియోను చూడండి.
రంజాన్ ముస్లింలకు ఎంతో విశేషమైన పండుగ. ఇది మానవత్వానికీ, దానధర్మాలకు, పవిత్రతకు ప్రతీక. ఈ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజున చిన్నాపెద్దా, ధనికాపేద భేదాలు లేకుండా సహృదయంతో 'ఈద్ ముబారక్' అని శుభాకాంక్షలు తెలుపుకుని ఆలింగనం చేసుకుంటారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి, అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి, చిరుజీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది.
వీడియో వినియోగానికి అతి పెద్ద మూలం టెలివిషన్. టెలివిషన్ మనకు ఎన్నో రకాలుగా చాలా సమాచారాన్ని అదజేస్తుంది. అందరి జీవితాలలో ఇంతటి ముఖ్య పాత్ర పోషిస్తున్న టెలివిజన్ ను గుర్తుచేసుకుంటూ జరుపుకునే ఈ వరల్డ్ టెలివిజన్ డే న మన చిన్ననాటి తెలుగు టెలివిజన్ షోలను గుర్తుచేసుకుందాం ఈ podcast వింటూ.....
పెళ్ళికాని అమ్మాయిలకు సుగుణాల భర్త పొందడానికి చేసే పూజ
పెళ్లయిన మగువలకు ఐదోతనం అన్నీ ప్రసాదించే తదియ.... అట్లతద్ది
ఈ అట్లతద్ది గురించి మరిన్ని విశేషాలు మరియు దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడానికి మా ఈ అక్షర podcast వినండి.