All content for రాజేశ్వరి యండమూరి is the property of rajeshwari yandamuri and is served directly from their servers
with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........
భగవద్గీత.....సూక్తులు. 1.దేవునికి పూజించు సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండు. తద్వారా భగవత్ ఆశీర్వాదం తో శాంతి నీ వెంట, ఇంట, చెంత ఉండ గలదు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.
శ్రీ కృష్ణుడు ద్వాపర యుగంలో రెండు రకాలైన గానములు చేశాడు. అవి ఒకటి వేణు గానం,రెండవది గీతా గానం.వేణు గానం ద్వారా పశు,పక్ష్యాదులు,మునులను,గోపికలను పరవశింప జేశాడు. గీతా గానం ద్వారా అనంతమైన, అనశ్వరమైన వేదాంత సారాన్ని బోధించాడు
జనమేజయుడు తన తండ్రి పాము కాటు వలన మరణించాడని తెలిసి సర్ప జాతి మొత్తం నశించినట్లు సర్ప యాగము ప్రారంభించెను.చివరకు దేవగురువు బృహస్పతి మాటచే యాగమును మానెను.
యాదవులు కొందరు సాంబునికి స్త్రీ వేషము వేసి,గర్భవతి గా రూపుదిద్ది, మహర్షుల వద్దకు వెళ్ళి సాంబుని చూపి ఈమెకి మగ బిడ్డా లేక ఆడబిడ్డ పుడుతుందా అని అడిగిరి.అంత దివ్యదృష్టితో జరిగినది తెలుసుకొని, ఎవరును కాదు మీ వంశ నాశ నానికి ముసలం పుట్టునని శపించిరి.
హస్తినాపురం కౌరవ పాండవులకు రాజధాని.దానినిపుడు ఢిల్లీ అనుచున్నాము.ఇది యమునా నది ఒడ్డున ఉన్నది. ఈ పట్టణము ఒక వైపుకు ఒరిగినట్లు అగుపించును.దీనికి కారణం బలరాముని సాహస కృత్యమే.
పూర్వము పరశు రాముడు ఇరువది ఒక్క మార్లు దండయాత్ర చేసి, క్షత్రియులు అందరినీ సంహరించెను. ఆ రక్తము ఏరులై పారి ఐదు మడుగులు గా ఏర్పడేను. వానినే శ్యమంత పంచకము లు అందురు.
కృష్ణుడు అంత కుచేలునితో ఫలం,పత్రం,పుష్పం,తోయం ఏదైనను భక్తితో సమర్పించిన సంతోషముగా స్వీకరింతును. సందేహించకుండా నీవు నా కొరకు తెచ్చినది చూపుము అని చిరు నగవులు చిందించెను.
శిశుపాలుడు పుట్టుకతో నాలుగు చేతులు,మూడవ కన్ను కలిగి ఉండెను.బాలుని వికృత రూపం చూసి అందరూ భయపడిరి. అప్పుడు ఆకాశవాణి ఆ బాలుని ఎవరైనా ఎత్తుకొని నపుడు ఎవరి చేతిలో అదనపు అవయవములు పోవునో వారి చేతిలోనే అతనికి మరణం సంభవించును అని పలికెను.
నరకుడు ప్రాగ్జ్యోతిష పురమునకు రాజు.శ్రీ మహా విష్ణువు యొక్క కుమారుడు. భూదేవి అతని తల్లి. దుష్టుడు.బల గర్వితుడు.పలు శస్త్రాస్త్రములను సాధించి, ముల్లోకాలను బాధ పెట్టుచుండేను.