వినాయక చవితి సందర్బంగా , ఆగస్టు 27 వ తేదీ నుండి, 49 రోజుల పాటు పూజ్యా గురుమా ఆత్మా నందమయి అమ్మ గారి తో ప్రత్యక్షంగా ( స్పెషల్ లైవ్ - ద్వారా) సుషుమ్న క్రియా యోగ ధ్యానం చేసే అరుదైన అవకాశం.
ఈ 49 రోజులు పాటు జరిగే ధ్యాన కార్యక్రమం ఎంతో విశేషమైనది. ప్రతి రోజు ఈ "స్పెషల్ లైవ్ మెడిటేషన్ " సెషన్ లో పాల్గొనడం ద్వారా, గురువులు అందించిన ఈ దివ్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధ్యాన సాధన ద్వారా ప్రశాంతతను మరియు ఆనందాన్ని పొందండి.
పరమ శివుడి అర్ధనారీశ్వర దివ్య రూపం వెనుక ఉన్న నిగూఢమైన రహస్యం ఏమిటి?? ఆ రూపాన్ని స్వామి ఎందుకు ధరించారు? సకల సృష్టికి ఆది దంపతులు అయిన శివ పార్వతుల నిజ తత్వం ఏమిటి? అర్ధనారీశ్వర రూపం వెనుక దాగి ఉన్న యోగ పరమార్థాన్ని ఆవిష్కరించే సంభాషణా సమాహారం ఈ వారం పాడ్కాస్ట్.
కైలాసం మహా దేవుడైన పరమ శివుడి నివాసం. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ పర్వత ప్రత్యేకతను గురించి తెలుసుకోవాలని చూశారు. రెండు పర్యాయాలు ఈ పర్వతం పైకి విమానాలను పంపేందుకు ప్రయత్నం చేయగా, ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కైలాసం పవిత్ర స్థలం. జగన్మాత పార్వతి, జగత్ పిత పరమేశ్వరుడు నివాసం ఉండే ప్రదేశం కైలాసం. అయితే సుషుమ్న క్రియా యోగులు ధ్యానం ద్వారా కైలాస పర్వత దర్శనం చేసుకొవడం ఎలా..? అనే ఆసక్తికర విషయాల సమాహారమే ఈ వారం పాడ్కాస్ట్.
దేవతలు, దానవులు సాగర మథనం చేసినప్పుడు మొదట ఆవిర్భవించింది హాలాహలం. ఈ భయంకర విష ప్రభావం వల్ల లోకాలు నాశనం కావడం మొదలైంది. బ్రహ్మాది దేవతలు, రాక్షసులు “రక్షమాం” అంటూ శివుడిని శరణు వేడారు. ఆ కరుణా సింధువు గరళాన్ని మింగి విశ్వాన్ని రక్షించాడు. ఈ అద్భుత పురాణ కథలోని నిగూఢార్థాన్ని తెలియజేసే పాడ్కాస్ట్ ఈ వారం.
రుద్రాక్ష పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైనది. రుద్రాక్ష మాలలను శివుడు మొదలుకొని ఎందరో యోగులు ఆభరణంగా ధరిస్తారు. హిమవత్ పర్వత ప్రదేశంలో లభించే రుద్రాక్షలు సాధనకు ఎంతో ఉపకరిస్తాయి. రుద్రాక్ష ధారణ, రుద్రాక్ష విశిష్టత ఇత్యాది విషయాల సమాహారం ఈ వారం సుషుమ్న వాణి పాడ్కాస్ట్.
మహా మృత్యుంజయ మంత్రాన్ని మహా సంజీవని మంత్రం అంటారు. ఈ మహా మంత్ర నిగూఢార్థం, మంత్ర ఆవిర్భావం, మంత్ర విశేషం ఇత్యాది విషయాల సమాహారం ఈ వారం సుషుమ్న వాణి పాడ్కాస్ట్.
ఈ ఎపిసోడ్ లో శివ పంచాక్షరీ మంత్ర వైశిష్ట్యాన్ని గురించి, పంచాక్షరీ మంత్ర మహత్తు, ఓంకార బీజాక్షర మహిమ వంటి ఆసక్తికర విషయాలను గురించి తెలుసుకుందాం.
ఈ ఎపిసోడ్ లో ఆది యోగి అయిన శివుడిని ఆది గురువుగా, క్రియా యోగ దీక్షా గురువుగా దర్శిద్దాం. శివ తత్వంలోని అంతరార్థాన్ని అన్వేషిద్దాం. మీ ప్రశ్నలు, మీ విలువైన సలహాలు, సందేశాలు క్రింది ఈమెయిల్ కి పంపండి
sushumnavani@divyababajikriyayoga.org
ఈ ఎపిసోడ్, ఆత్మను పరమాత్మలో లయం చేసే యోగం గురించి , దానికి సాధనంగా ఉపయోగపడే యోగా గురించి , యోగి యొక్క లక్షణాలను గురించి వివరిస్తుంది.
ఈ ఎపిసోడ్,
గురు శిష్య సంబంధాన్ని, గురువు , తన శిష్యులపై చూపించే అపారమైన కృపామృతాన్ని, గురువు పట్ల శిష్యుని కర్తవ్యాన్ని వివరిస్తుంది.
ఈ ఎపిసోడ్, సంకల్పం యొక్క శక్తిని, విశ్వ శ్రేయస్సుకై చేసే సంకల్పాల ప్రయోజనాన్ని, ఏవిధమైన సత్సoకల్పాలు చేసుకోవాలి? వాటిని నెరవేర్చుకునేందుకు ఏ విధమైన సాధనను అలవరచుకోవాలి వంటి అంశాలను తెలియజేస్తుంది.
ఈ ఎపిసోడ్, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ యొక్క లక్ష్యాన్ని, వారి సేవా కార్యక్రమాల వివరాలను తెలియజేస్తుంది.
ఈ ఎపిసోడ్, విజయదశమి పండుగ ప్రత్యేకతను, నవ దుర్గల విశిష్టతను, మరియు శరన్నవరాత్రుల విశేషాలను తెలియజేస్తుంది.
ఈ ఎపిసోడ్, సేవ అంటే ఏమిటి, ఏ భావంతో సేవ చేయాలి, వివిధ సేవా మార్గాలను మరియు సేవ చేయటం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది.
ఈ ఎపిసోడ్, వినాయక చవితి పండుగ యొక్క విశేషాలను, మరియు ఆధ్యాత్మిక భావనలను వివరిస్తుంది.
ఈ ఎపిసోడ్, శ్రీకృష్ణుని జననం మరియు బాలకృష్ణుని లీలలను గురించి, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను గురించి వివరిస్తుంది.
ఈ ఎపిసోడ్, దేశ స్వాతంత్రం మరియు వ్యక్తిగత స్వేచ్ఛతో పాటూ, ఆధ్యాత్మిక పరమైన ఆత్మ యొక్క స్వాతంత్రం గురించి వివరిస్తూ, ఆత్మ యొక్క స్వేచ్ఛకు అడ్డంకులుగా ఉన్న అంశాలను , వాటిని అధిగమించి ఆత్మ యొక్క స్వాతంత్ర్యాన్ని పొందే మార్గాలను
తెలియజేస్తుంది .
ఈ ఎపిసోడ్, సామూహిక ధ్యానం అంటే ఏమిటి? ఈ సామూహిక ధ్యానంలో పాల్గొనటం వలన కలిగే ప్రయోజనాలను, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ వారిచే నిర్వహించబడుతున్న సామూహిక ధ్యాన కార్యక్రమాల వివరాలను, వాటి ఆవశ్యకతను తెలియజేస్తుంది.
ఈ ఎపిసోడ్ గురుపౌర్ణమి విశిష్టతను, అమ్మ గారి చేతుల మీదుగా జరిగే హోమం యెుక్క వైశిష్ట్యంతో పాటూ, గురు పూజా మహోత్సవ కార్యక్రమ విశేషాలను తెలియజేస్తుంది.
ఈ ఎపిసోడ్, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ వారిచే నిర్వహించబడుతున్న డిటాక్స్ కార్యక్రమం యెుక్క వివరాలలో భాగంగా డిటాక్సిఫికేషన్ అంటే ఏమిటి? దీని ఆవశ్యకత ఏమిటి? వాటిలో ఉపయోగించేందుకు మన అమ్మగారు సూచించే పదార్థాలను, వాటి ఔషధ గుణాలను, మరియు వాటి ప్రయోజనాలను తెలియజేస్తుంది.