
ఎప్పుడైనా మీరు మీ పాత ఫ్రెండ్స్ మీకు కాల్ చేశారనుకోండి, “ఏరా ఎలా ఉన్నావ్?” “ఎన్ని రోజులైపోయింది రా మనం కలిసి....అప్పట్లో” అని సోది మొదలెట్టకండి. అన్ని సంవస్త్సరాల తర్వాత మీకు కాల్ చేసాడు అంటే వాడికి ఎదో పని ఉంది ఉండాలి లేదా వాడి జీవితంలో జరిగే ఎదో ముఖ్యమైన ఈవెంట్ కి మిమ్మల్ని invite చెయ్యాడానికి అయినా అయుండాలి. కారణం ఈ రెండిట్లో ఏదైనా కానివండి, కాల్ lift చేసిన వెంటనే nostalgic సోది పెట్టకుండా, “చెప్పు బావా!, లేదా చెప్పు రా!” అని మొదటిమాటగా అని చుడండి. వాడు మిమ్మల్ని లైఫ్ లో మర్చిపోడు.
అన్నేళ్ల తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి కాల్ చేసాడు అంటే ఫ్రెండ్ అంటే మీరొకరు ఉన్నారు ఉన్న hope అయుంటుంది. అది సాధించుకోడం అందరికి possible కాదు. మీకు ఆ గౌరవం దొరికింది అంటే మీరు “మనం దూరం వెళ్లిపోయి చాలా రోజులు అయింది” అని పలకరించడం వలన మీ బంధం ఎదో పొడిపొడి గా ఆ ఫోన్ మాట్లాడినంతసేపే ఉంటుంది. ఆఖరికి మీరో స్నేహితుడిని, మీ స్నేహితుడు స్నేహం మీద ఉన్న ఆశని కోల్పోతారు.