
https://www.manatelugukathalu.com/post/akhari-korika-telugu-story-653-jidigunta-srinivasa-rao
ఆఖరి కోరిక | Aakhari Korika is a Telugu short story, originally published in manatelugukathalu.com
కథ క్లుప్తంగా:
'కంది పచ్చడిలోకి నెయ్యి బాగా వేసుకొని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాము.
ఇక అందులోకి అనుపానంగా పచ్చి పులుసు కూడా వుంటే ఆ బెత్తెడు దూరం కూడా ఉండదు.' అనేది కృష్ణమూర్తి ఫిలాసఫీ.
కానీ అనుకోకుండా గుండె జబ్బు వచ్చిందతనికి. అప్పట్లో నెయ్యి తింటే గుండెకు మంచిది కాదనే అపప్రధ ఉండేది. దాంతో తనకిష్టమైన కంది పచ్చడి+నెయ్యి+పచ్చి పులుసు కాంబినేషన్ కు దూరం అయ్యాడతను. చివరి రోజుల్లో అయినా అతని కోరిక తీరిందేమో ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన 'ఆఖరి కోరిక' హాస్య కథ వింటే తెలుస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.